బతుకమ్మ సంబరాలు ఐడీఓసీ లో ఘనంగా
— బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సాంప్రదాయ వైభవం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా మంగళవారం జిల్లా ఐడీఓసీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు సాంప్రదాయ నృత్యాలతో ఆడిపాడుతూ సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో DSCDO వెంకటేశ్, DBCDO జయరాజ్, DTDO సతీష్ యాదవ్, ABCDO చక్రధర్, అలాగే హాస్టల్ వార్డెన్లు పవన్, సునీత, స్వప్న, సరిత, గంగాసుధ, మంజుల, సుజాత, స్వామి, రాజేశ్వర్ పాల్గొన్నారు. అదనంగా TNGOs అధ్యక్షులు వెంకటరెడ్డి, దేవరాజు, వసతి గృహాల విద్యార్థినులు, సిబ్బంది మరియు పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థినుల నృత్యాలు, పాడిన పాటలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి.