దోమకొండలో దుర్గామాత అమ్మవారికి పట్టు చీరల సమర్పణ

దోమకొండలో దుర్గామాత అమ్మవారికి పట్టు చీరల సమర్పణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23 

 

దోమకొండలో శారన్నవరాత్రి సందడికి మరింత శోభ తెచ్చేలా దుర్గామాత అమ్మవారికి పట్టు చీరలు సమర్పించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిప్పపురం రవి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శ్రీనాథ్ తో పాటు పున్న లక్ష్మణ్, విట్టల్, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ తదితరులు హాజరయ్యారు.

భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికతతో నింపింది.

 

Join WhatsApp

Join Now