కామారెడ్డిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

కామారెడ్డిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

 — సరియైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు

 — రోడ్డు భద్రతపై అవగాహన

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 24

కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి కే.శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జై శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గడువు ముగిసిన వాహనాలను సీజ్ చేయగా, సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు జారీ చేశారు.

సిరిసిల్ల రోడ్డు, మాచారెడ్డి మండలం, బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీ చేయగా, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఇకపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, అన్ని ధ్రువపత్రాలతోనే ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉదయ్, రఫీ, స్నిగ్ధ, శంకర్, మధుకర్, కృష్ణతేజ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now