బస్టాండ్ లో త్రాగు నీరు కరువు

బస్టాండ్ లో త్రాగు నీరు కరువు

.. పరిష్కరిస్తానని చెప్పిన డిపో మేనేజర్ దినేష్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 24 

 

 

కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో ప్రయాణికులకు తాగునీటి సమస్య చాలా ఉంది గత కొన్ని నెలలుగా 

బస్టాండ్ ఆవరణలో మంచినీటి సదుపాయం లేక ప్రయాణికులు డబ్బులు వెచ్చించి నీరు తాగాల్సి వస్తుంది గతంలో ఉన్న ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులు చాలాసార్లు విన్నవిచ్చుకున్నట్టు చెప్పారు కానీ పట్టించుకోలేకపోయారు 

గతంలో కామారెడ్డి డిపోలో సిఐగా పనిచేసి ఇప్పుడు డిపో మేనేజర్ గా వచ్చినటువంటి దినేష్ దృష్టికి తీసుకెళ్లగా తను ఇంతకుముందు కామారెడ్డి బస్ డిపోల సిఐగా పనిచేసిన అనుభవం ఉన్నందున అవగాహన ఉందని

కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ఆవరణలో బోర్ల నుండి నీరు రావడంలేదని నీటి సమస్య ఉందని.

వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి నీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది 

అలాగే కామారెడ్డి కొత్త బస్టాండ్ లో ఉన్న కొన్ని సమస్యలు పరిశుభ్రత 

సీసీ కెమెరాల పర్యవేక్షణ భారీ

 వర్షాల ప్రభావం వల్ల బస్టాండ్ ఆవరణలో నీరు నిలుస్తున్నాయని మరమ్మత్తులు చేపడతామని ఇలా ఒక్కొక్కటి అన్నిటిని అభివృద్ధి చేస్తానని తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని . డిపో మేనేజర్ దినేష్ తెలియజేయడం జరిగింది

Join WhatsApp

Join Now