దాబాల్లో అక్రమ సిట్టింగులు క్షమించరాదు – జిల్లా ఎస్పీ హెచ్చరిక

దాబాల్లో అక్రమ సిట్టింగులు క్షమించరాదు – జిల్లా ఎస్పీ హెచ్చరిక

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 24

 

 

 

కామారెడ్డి జిల్లాలో పలు దాబాల్లో మద్యం విక్రయాలు, అక్రమ సిట్టింగులు నిర్వహించడాన్ని పోలీసు విభాగం సహించబోదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్., స్పష్టం చేశారు.

 

బిచ్కుంద మండలం పత్లాపూర్ శివారులో గల 36 దాబా యజమాని బలిజ గంగాధర్ 26-06-2025న ఎటువంటి అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగ్ ఏర్పాటు చేయడంతో పోలీసుల దాడిలో పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతనిని బిచ్కుంద ఎమ్మార్వో రూ.50 వేల బైండోవర్‌కు ఒక సంవత్సరానికి బంధించారు.

 

అయితే ఇటీవల 22-09-2025న అదే దాబాలో మళ్లీ అక్రమ సిట్టింగ్ నిర్వహించగా, పోలీసులు మరోసారి దాడి చేసి పట్టుకున్నారు. ఇప్పటికే బైండోవర్‌లో ఉన్నా మళ్లీ అదే తప్పు చేసినందుకు, ఈసారి గంగాధర్‌పై బిచ్కుంద ఎస్ఐ కేసు నమోదు చేసి ఎమ్మార్వో ముందు హాజరుపరిచారు. అనంతరం ఎమ్మార్వో రూ.50 వేల జరిమానా విధించారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరిస్తూ…

జిల్లాలోని దాబా యజమానులు తమ దాబాల్లో మద్యం విక్రయాలు, సిట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకసారి బైండోవర్ అయిన తరువాత కూడా మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడితే జరిమానాలతో పాటు మరింత కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now