సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేసిన భానుప్రకాశ్..

సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేసిన భానుప్రకాశ్..

ఇద్దరు బాధితులకు సకాలంలో రక్తం అందజేత..

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25

 

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ సిద్దిపేట్ ప్రభుత్వ వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో సిద్దిపేట్ కు చెందిన స్వాములపల్లి భానుప్రకాష్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని, మెదక్ జిల్లా నార్సింగ్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై కొల్లుగారి నరసింహ కు బి పాజిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్యశాలలో చికిత్సల నిమిత్తమై పది మంది వరకు వివిధ గ్రూపుల రక్తము కోసం సంప్రదించడం జరుగుతుందని వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరం రక్తుదాతల సహకారంతో అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.నేటి సమాజంలో ఇప్పటికి రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని,కొన్ని సందర్భాల్లో బాధితుల కుటుంబ సభ్యులు కూడా రక్తదానానికీ ముందుకు రావడం లేదని అన్నారు.రక్తదానం చేయాలనుకున్న వారు వారి వివరాలను 9492874006 కు పంపించాలని అన్నారు.

Join WhatsApp

Join Now