హిందూ యువసేన ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

హిందూ యువసేన ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దుర్గామాత మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవరాత్రుల నాలుగవ రోజు శ్రీ కాత్యాయిని దేవి భక్తులకు దర్శనమిచ్చారు.

అన్న ప్రసాదానికి విరాళాలు అందించిన దాతల్లో ఉత్తునూరి రవి పాటిల్ (షెడ్డు దాత), కుంటి పెద్ద నర్సిములు, చాకలి లింగం, క్యాతం నారాయణ (విగ్రహ దాతలు), ఉక్కయ్య గారి రాజేష్, గడ్డమీద ప్రభాకర్, మెడుదుల గంగాధర్ (పూజా సామాగ్రి దాతలు), పోతారం సంతోష్, పెద్ద పోతన్న గారి రాజేందర్ (సెంట్రింగ్ దాతలు), పొన్నాల భరత్ (లడ్డు దాత), ఒడ్డెం లింబాద్రి, బండి బబ్లు, మేడదుల శ్రీనివాస్ సాయిపవన్ (అన్నదాతలు), శ్రేయన్ పటేల్, హాని పటేల్ (నిత్య చీరాల దాతలు) ఉన్నారు.

భక్తుల సహకారం, దాతల విరాళాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now