ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 26, (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మీసానిపల్లి రైతు వేదికలో రాబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ శిక్షణను డీఎల్పిఓ, ఎంపీడిఓ ఆధ్వర్యంలో, టీ.ఓ.టీ (శిక్షకుల శిక్షణ) అయిన కే .దేవేందర్, పి. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.
శిక్షణలో పాల్గొన్న అధికారులకు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సెంటర్లలో విధులు, బ్యాలెట్ బాక్స్ భద్రత, ఓటర్ల గుర్తింపు, సీల్ ప్రక్రియ, కౌంటింగ్ విధానం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యం కాబట్టి, ఎన్నికల ప్రక్రియలో ఒక్క చిన్న తప్పిదం కూడా చోటు చేసుకోకూడదని టీ.ఓ.టీ లు హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.