ఎన్నికల శిక్షణలో కలెక్టర్ సూచనలు
అవగాహనతోనే సజావుగా పోలింగ్ – పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 26
సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.అవగాహనతో ఎన్నికల విధులను నిర్వహించాల్సిన అవసరాన్ని కలెక్టర్ నొక్కిచెప్పారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తాసిల్దార్ సత్యనారాయణ, మండల విద్యాధికారి యోసఫ్, మండల పంచాయతీ అధికారి సురేందర్, మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.