ఇస్రోజివాడి గ్రామంలో దుర్గమత మండపాలకు ఎమ్మెల్యే పట్టుచీరల అందజేత

ఇస్రోజివాడి గ్రామంలో దుర్గమత మండపాలకు ఎమ్మెల్యే పట్టుచీరల అందజేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27

 

తెలంగాణా అడ్డా ఆధ్వర్యంలో ఇస్రోజివాడి గ్రామంలో శనివారం ప్రజాప్రతినిధి, శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి దుర్గమత మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంప్రదాయ ఆచారాలకు గుర్తుగా పట్టుచీరలను అందజేస్తూ గ్రామస్తులతో సన్నిహితంగా మమేకమయ్యారు. స్థానికులు ఎమ్మెల్యే హర్షధ్వానాలతో స్వాగతించారు. దుర్గమత మండపాల్లో నిర్వహించే ఆరాధనలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా అడ్డా నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరిపారు.

Join WhatsApp

Join Now