ఎల్లారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం):

క్విట్ ఇండియా పోరాటం, గైరీ ముల్కీ ఆందోళన, తెలంగాణ తొలి–మలిదశ ఉద్యమాల్లో విశిష్ట పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

పట్టణ పద్మశాలి అధ్యక్షులు విద్య రవికుమార్ నేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల, డివిజన్, జిల్లా స్థాయి పద్మశాలి నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా పాల్గొన్నవారిలో పద్మ పండరి నేత, షేర్ల ప్రభు లింగం నేత, దేవసాని పోశెట్టి నేత మరియు పద్మ కాశీరాం నేత ఉన్నారు.

కార్యక్రమంలో నాయకులు పేర్కొన్నారు – కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, త్యాగాలు, సమరస్ఫూర్తి నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

Join WhatsApp

Join Now