భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా ఛాయ్ వాలా

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా ఛాయ్ వాలా

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(కృష్ణ ఆయుధం) సెప్టెంబర్ 29

 

 

కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శిగా అంకాలపు శ్రీనివాస్‌ (హోటల్‌ శ్రీను) నియమితులయ్యారు. 1995లో సామాన్య కార్యకర్తగా బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్‌, 2006 నుంచి క్రియాశీల సభ్యునిగా కొనసాగుతున్నారు. రెండు సార్లు మండల కార్యదర్శిగా, రెండు సార్లు మండల ప్రధాన కార్యదర్శిగా, అలాగే రెండు పర్యాయాలు జిల్లా కార్యవర్గ సభ్యునిగా కీలక భాద్యతలు నిర్వహించారు.

 

ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. “నాపై నమ్మకంతో ఇలాంటి బాధ్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజుల అన్నకి, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తాను” అని తెలిపారు.

Join WhatsApp

Join Now