కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 1
జిల్లా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మొత్తం నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ – 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు.
ఈ యాక్ట్ అమలులో ఉన్న కాలంలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, ప్రజా సమావేశాలు, పబ్లిక్ మీటింగులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.
అనుమతి లేకుండా ఈ తరహా కార్యక్రమాలు చేపడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగానికి సహకరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు
Published On: October 1, 2025 7:31 pm