మలేషియాలో ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం

మలేషియాలో ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం

కౌలాలంపూర్‌ చేరుకున్న ఎంపీ ఈటల రాజేందర్‌

BAM అధ్యక్షుడు చోప్పరి సత్య, ప్రధాన కార్యదర్శి రవితేజ, ట్రెజరర్ సునీల్, కోర్ కమిటీ సభ్యుల ఆతిథ్యం

దసరా, బతుకమ్మ, దీపావళి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు

ఈటల కుటుంబ సమేతంగా రాకతో ఉత్సవానికి ప్రత్యేక శోభ

ప్రవాస భారతీయుల ఆత్మీయత, ఐక్యత ప్రతిబింబించిన వేడుక

ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 4:

మలేషియాలోని ప్రవాస భారతీయులు తెలంగాణా రాజకీయ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ కి ఘన స్వాగతం పలికారు. కౌలాలంపూర్ చేరుకున్న ఆయనను భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో అధ్యక్షుడు చోప్పరి సత్య, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీదాస్యం, ట్రెజరర్ సునీల్ కుమార్ తో పాటు కోర్ కమిటీ సభ్యులు ఆత్మీయంగా పలకరించారు.

BAM ప్రతినిధులు మాట్లాడుతూ—

“మన దసరా, బతుకమ్మ, దీపావళి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరు కావడం ఆనందకరం. ఆయన కుటుంబ సమేతంగా రాకతో ఈ వేడుకలు మరింత ఉత్సాహంగా, వైభవంగా సాగనున్నాయి” అని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయుల సమైక్యతను ప్రతిబింబించిన ఈ ఆతిథ్య కార్యక్రమం, రాబోయే పండుగల వాతావరణానికి నాంది పలికింది.

Join WhatsApp

Join Now