ఇక మాట్లాడుకో నాయనా..?
విధుల నుంచి డ్రైవర్ తొలగింపు
ఆర్టీసీ బస్సును నడుపుతూ ఫోన్లో నిరాటకంగా మాట్లాడుతూ.. అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన అద్దె బస్సు డ్రైవర్ వినోద్ ను ఆర్టిసి అధికారులు విధుల నుండి తొలగించారు. నిన్న హలో షాద్ నగర్ లో వచ్చిన కథనానికి అదేవిధంగా వార్త దినపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా అతని విధుల నుండి డిపో మేనేజర్ ఉష తొలగించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణికులు ప్రశ్నించిన కూడా పట్టించుకోకుండా వివరించిన అద్దె బస్సు డ్రైవర్ వినోద్ ను విధుల నుండి పక్కన పెట్టారు. అయితే ఇలాంటి ఘటనలే మరో రెండు మూడు జరిగినట్లు సమాచారం తెలుస్తుంది వారిని కూడా తీవ్రంగా మందలిచ్చి పక్కన పెట్టినట్టు సమాచారం. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడిన డ్రైవర్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు విధుల నుండి తొలగించాక అందరూ కామెంట్ చేస్తున్నారు ఇక మాట్లాడుకో నాయనా తీరిగ్గా అంటున్నారు..