ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్చరర్ ల బదిలీని నిలిపివేయాలి
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 26, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్ కార్ వినయ్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫారెస్టరీ విభాగంలో లెక్చరర్ గా బోధిస్తున్న సుచారన్ బదిలీని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు ఫారెస్టరీని అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 160 పైగా ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఫారెస్ట్రీ విద్యార్థులకు బోధిస్తున్న సుచరణ్ బదిలీతో ఇక్కడి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఫారెస్టరీ సబ్జెక్టు బోధించడానికి ఇక్కడ అధ్యాపకుడు లేకపోవడం వలన ఇక్కడున్న విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కావున అధికారులు స్పందించి తక్షణమే ఈ బదిలీని ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే గత సంవత్సరం ప్రవేశపెట్టిన బీబీఏ రిటైల్ ఆపరేషన్ కోర్సుకి ఫ్యాకల్టీ కొరత ఉందని, అధికారులు విద్యార్థులు సమస్యను దృష్టిలో పెట్టుకొని తక్షణమే బి బి ఏ రిటైల్ ఆపరేషన్ కోర్స్ కి అధ్యాపకులని నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిరాం, శివ , సాయికిరణ్, అబిలాష్, శరవణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.