మద్యం షాపులకు 166 దరఖాస్తులు

మద్యం షాపులకు 166 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాప్‌లకు ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 (ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 13 

2025–2027 సంవత్సరాలకు మద్యం దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా ఈ రోజు (13.10.2025) వరకు మొత్తం 166 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు తెలిపారు.

జిల్లాలోని వివిధ స్టేషన్ పరిధుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి—

కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాప్‌లకు 45 దరఖాస్తులు అందాయి.

దోమకొండ స్టేషన్ పరిధిలో 8 వైన్ షాప్‌లకు 25 దరఖాస్తులు వచ్చాయి.

ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 వైన్ షాప్‌లకు 19 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.

బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 వైన్ షాప్‌లకు 43 దరఖాస్తులు అందాయి.

బీచుకుందా స్టేషన్ పరిధిలో

 10 వైన్ షాప్‌లకు 34 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

మొత్తం‌గా కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాప్‌లకు 166 దరఖాస్తులు అందినట్లు హనుమంతరావు వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment