బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పికొడతాం — బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిక

 

 

 

 

 

 

 

బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పికొడతాం — బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిక

42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కు కారణమైన నేతలపై ఆగ్రహం

అగ్రవర్ణాల నాయకుల ‘సంబరాలు’ శోచనీయం అని బీసీ నాయకుల విమర్శ

60% బీసీల ఓట్లతోనే అధికారాన్ని పొందిన నాయకులు గుర్తు పెట్టుకోవాలన్న హెచ్చరిక

విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగింపు

సోషల్ మీడియాలో బీసీలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే సహించమన్న నేతలు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 13 

 

బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలన్న అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడతామని బీసీ విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, “బీసీలకు చట్టసభల్లో ఆమోదం పొంది జీవో 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రవర్ణ నేతలు అడ్డుకోవడం న్యాయబద్ధం కాదు” అని పేర్కొన్నారు.

రెడ్డి జాగృతి నేతలు పిటిషన్ వేసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, స్టే వచ్చిన వెంటనే కొంతమంది అహంకారపూరిత నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం దౌర్భాగ్యకరం అని విమర్శించారు.

బీసీల ఓట్లతోనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ముఖ్యమంత్రులు పదవులు పొందారని గుర్తు చేస్తూ — “బీసీలు తిరగబడితే రాజకీయ భవిష్యత్తు భూమ్మీద ఉండదు” అని హెచ్చరించారు.

బీసీల నోటికాడి ముద్ద లాక్కోవడం తట్టుకోమని, 42 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా అమలు అయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలు ఐక్యంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని తెలిపారు.

సోషల్ మీడియాలో బీసీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే అగ్రవర్ణ నాయకులను హెచ్చరిస్తూ, “మా బహుజన శక్తి ఏంటో చూపిస్తాం” అని నీల నాగరాజు పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు అబ్రబోయిన స్వామి, మర్రి శేఖర్, నల్లపు రమేష్, నల్లపు రాజేందర్, మల్లేష్, పూలబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment