కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరణ

కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరణ

రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 13

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కనీస మద్దతు ధరలు (MSP) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల అవగాహన కోసం కనీస మద్దతు ధరల వివరాలు మరియు కాటన్ కాపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియపై సమాచారాన్ని అందించే పోస్టర్లు విడుదల చేశారని తెలిపారు.

సంచాలకులు, మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ వారు సరఫరా చేసిన MSP ధరలు మరియు పత్తి ప్రొక్యూర్మెంట్ పోస్టర్లు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పోస్టర్లు రైతులకు ఉపయోగకరంగా ఉండి, మార్కెట్‌లో సరైన ధరకు తమ పంటలను విక్రయించడంలో అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీకి పోస్టర్లను పంపిణీ చేయడం జరిగిందని, అక్కడి నుండి గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు, మండల వ్యవసాయ కార్యాలయాలకు కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment