భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15

నిర్మల్ జిల్లా: నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి, సాదా బైనామా, ధ్రువపత్రాల జారీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రజావాణి, సిఎం ప్రజావాణి, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఎదుర్కునేందుకు దోహదపడే వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ లను కలెక్టర్ అభిలాష అభినవ్ తహసిల్దార్లకు అందజేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment