అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 15: కూకట్‌పల్లి ప్రతినిధి

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకం అని తెలియచేసారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, బి.వెంకటేష్, కరీమ్, నజీర్, షౌకత్ అలీ మున్నా, పెద్ద ఖాజా, చిన్న ఖాజా, గౌస్, యాజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment