బెస్ట్ అవైలబుల్ నిదులు విడుదల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాల  పరాకాష్టకు చిరున బెస్ట్ అవైలబుల్స్ 

బెస్ట్ అవైలబుల్ నిదులు విడుదల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాల

పరాకాష్టకు చిరున బెస్ట్ అవైలబుల్స్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

ఫీజులు విడుదల చేయకపోతే చదువులు కొనసాగేదెలా

పేద విద్యార్థులపై వివక్ష చూపిన ప్రభుత్వాలు మునగడ సాధించలేదు* బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ బిల్లులను చెల్లించకపోతే ఆందోళన తప్పదు

విద్యార్థులకు శాపంగా మారిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు

ఏఐఎస్ఎఫ్

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 15 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు బిల్లులు చెల్లించకుండా విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ వారిపట్ల వివక్షత చూపుతుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జూలూరుపాడు లో నాయకులు సమావేశంలో గుగులోత్ వంశీ మాట్లాడుతూ. గత 35 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మూసివేతకు సిద్ధపడుతున్నాయి అన్నారు. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 200, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయని ఆ స్కూల్స్లో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 23,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు 7000 మంది విద్యార్థుల విద్యను అభ్యసిస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 – 25 – 26, విద్యా సంవత్సరం గాను సుమారుగా రూ,,180 కోట్లు బకాయిలు పెండింగ్ ఉండడంతో ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వం ఫీజులు చెల్లించే వరకు విద్యార్థులను పాఠశాలలకు రావద్దని హుకుం జారీ చేశాయని దీనితో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు నిధులు ఉంటాయి గాని ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్స్ స్కూల్ కి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ ద్వారా ప్రతి ఏటా 3,500 మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేస్తున్న ఆశించిన ఫలితాలు రావట్లేదన్నారు తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ని తక్షణమే విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ సాయి తేజ, గుగులోత్ అనిల్ నాయకులు రామ్, చైతన్య ,హరిరామ్,పునీత్ కుమార్,సాయి ధనుష్ , హేమంత్,సాయి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment