కామర్స్ లో డాక్టరేట్ సాధించిన సీతంపేటవాసి గట్టయ్య యాదవ్
అభినందించిన పలువురు విద్యావంతులు మాజీ ప్రజా ప్రతినిధులు
జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 16 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో ని సీతంపేట గ్రామానికి చెందిన బక్కతట్ల గట్టయ్య ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ డి. చెన్నప్ప పర్యవేక్షణలో ఈ- నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ తెలంగాణ – ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై గట్టయ్య చేసిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ అధికారులు ఆయనకు పి హెచ్ డి పట్టాను ప్రధానం చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం గట్టయ్య హనుమకొండలోని భీమారంలో ఎన్ ఆర్ ఐ జూనియర్ కళాశాల లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా సీతంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి తెడ్ల ఓదెలు, మాజీ సర్పంచ్ మూడెత్తుల వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇంజం వెంకటస్వామి తో పాటు విద్యావంతులు ముడతనపల్లి మధుసూదన్ దాసరి కుమారస్వామి, మేకల కృష్ణ బక్కతట్ల బిక్షపతి,మేకల గణేష్ తెడ్ల బాబయ్య బక్కతట్ల రవీందర్, లు గట్టయ్య ను అభినందించారు.