బీసీ సంఘాల జేఏసీ బంద్ కు పూర్తి మద్దతు : ముమ్మారెడ్డి ప్రేమకుమార్

బీసీ సంఘాల జేఏసీ బంద్ కు పూర్తి మద్దతు : ముమ్మారెడ్డి ప్రేమకుమార్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 17: కూకట్‌పల్లి ప్రతినిధి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు రేపు 18వ తారీకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమం కూకట్పల్లి , శేలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో రాష్ట్ర సభ్యులు జర్నలిస్ట్ తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ కార్యక్రమానికి జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రేమకుమార్ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు బంద్ లో పాల్గొని బీసీ సంఘాల కి మద్దతు ఇవ్వాలని సూచనలు చేశారు .

ఈ కార్యక్రమంలో ఇప్ప రాకేష్, కెవి శివరాం , జనసేన నాయకులు కొల్ల శంకర్, వేముల మహేష్, కలిగినీడీ ప్రసాద్ , పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు తదితరులు పాల్గొని మద్దతు తెలుపడం జరిగింది.

Join WhatsApp

Join Now