రాజకీయాలు కాదు – న్యాయం జరగాలి : నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

42% బీసీ రిజర్వేషన్లకు ఓసి సంక్షేమ సంఘం మద్దతు

రాజకీయాలు కాదు – న్యాయం జరగాలి : నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

42% బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఓసి సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది

బీసీ వర్గాల న్యాయ హక్కులకు మేము వ్యతిరేకం కాదని స్పష్టం

కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ఆపాలని విజ్ఞప్తి

బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ చేయాలని డిమాండ్

అగ్రవర్ణ పేదల పరిస్థితి పైనా చర్చ అవసరమని సూచన

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17కామారెడ్డి: తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో బీసీ సంఘాలు కోరుకుంటున్న 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి తమ సంఘం పూర్తి మద్దతు ఇస్తోందని. బీసీ వర్గాల్లో ఎన్నో కులాలు ఇప్పటివరకు రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందలేదని, వారికి న్యాయం చేయడం సమాజ ధర్మమని పేర్కొన్నారు.

“బీసీల హక్కుల కోసం పోరాడడం రాజ్యాంగబద్ధం. కానీ కులాల మధ్య చిచ్చు పెట్టడం సరైంది కాదు. ప్రభుత్వం గాని ప్రతిపక్షాలు గాని దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు” అని ఆయన హెచ్చరించారు.

పార్లమెంటు ఉభయ సభల్లో 42% రిజర్వేషన్ బిల్లును చర్చించి ఆమోదించేలా తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

అగ్రవర్ణాల్లో పేదరికంలో ఉన్న కుటుంబాల పరిస్థితి కూడా దారుణంగా ఉందని గుర్తుచేస్తూ, వారికి కూడా సహాయం చేసే దిశగా బీసీ వర్గాలు సహకరించాలని కోరారు.

“నిజమైన బీసీ పేదలకూ, అగ్రవర్ణ పేదలకూ న్యాయం జరిగే సమాజం కోసం మేము బీసీ ఉద్యమానికి వెన్నంటి ఉంటాం,” అని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now