బీసీ ద్రోహులం మేము కాదు కాంగ్రెసోళ్లు..పసుల ప్రశాంత్
దాడి అబద్ధం…. తోపులాట నిజం..
కేంద్రంతో మాట్లకుండానే జంతర్ మంతర్ వద్ద ధర్నా ఎట్లా నిర్వహిస్తారు?
ఇది హైకోర్ట్, సుప్రీం కోర్ట్ కి వ్యతిరేకంగా బందా..??
మాధవ్ రెడ్డి కి వ్యతిరేకంగా బందా..??
కాంగ్రెస్ వ్యతిరేకంగా బందా??
ఇది ఎవరిమీద… ఎవరికోసం బంద్ …??
బీసీ ల పట్ల ప్రేమ ఉంటే నామినేటెడ్ పోస్టులు 72% రెడ్లకు ఎందుకు ఇచ్చారు..
మద్దతు ఇవ్వటానికి వెళ్తే ఇది కాంగ్రెస్ మీటింగ్ అని అంటున్నారు…
కానీ అక్కడ సీపీఎం సీపీఐ విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అన్ని ఉన్నాయి..
దాగుడు మూతలాట ఆడుతున్న ఆర్ కృష్ణయ్య..!
శత్రువు ఎవరో చెప్పకుండా ఇంకా బీసీ సమాజాన్ని ఎన్నేండ్లు మోసం చేస్తారు..
ఈరోజు షాద్ నగర్ లో బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించాలని బంద్ జరుగుతున్న సందర్భంగా బీజేపీ నాయకుడిగా బంద్ కి మద్దతు ఇవ్వటానికి అక్కడికి వెళ్లడం జరిగిందని బిజెపి నాయకుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ తెలిపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పసుపుల ప్రశాంత్ మాట్లాడుతుండగా ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని మైక్ గుంజుకొని వాగ్వాదం చేయడం జరిగిందని, కానీ అక్కడ సీపీఐ సీపీఎం విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అన్ని ఉన్నాయన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లా అవుతాదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పసుపుల ప్రశాంత్ మాట్లాడుతూ బీసీ సమాజాన్ని ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు మోసం చేయడం జరిగింది 75% ఏళ్లుగా బీసీ లు రాజకీయ అంటరాని తనాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు బంద్ ఎందుకో ఆర్ కృష్ణయ్య క్లారిటీ ఇవ్వాలి బిజెపి వ్యతిరేకమైన పోరాటం అంటే మేం ఎందుకు పాల్గొంటాం మేం మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఇది మా మీటింగ్ అని మైక్ గుంజుకున్నారు మరి అందరూ మద్దతు ఎందుకు అడిగారు?? ఆర్ కృషయ్య దాగుడు మూతలు ఆడుతూ మన శత్రువు ఎవరో చెప్పకుండా బీసీ సమాజాన్ని ఇంకెంత కాలం మోసం చేస్తారు 42% రిజర్వేషన్లను హైకోర్ట్ సుప్రీంకోర్టు వ్యతిరేకించింది వాటికి వ్యతిరేకంగా బంద్ పెట్టారా?? లేకుంటే మాధవ్ రెడ్డి పిటిషన్ వేసినందుకు అతనికి వ్యతిరేకంగా బంద్ పెట్టారా??? లేదంటే బీసీ సమాజాన్ని కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తాం అని మోసం చేస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా బంద్ నిర్వహించారా??? మిత్రులారా నిజంగా రేవంత్ రెడ్డి కి బీసీ ల పట్ల చిత్త శుద్ది ఉంటే కుల గణన రిపోర్టు ఎందుకు బహిర్గత చేయటం లేదు డెడికేషన్ కమిషన్ బూస వెంకటేశ్వర్లు ను నామమాత్రంగా నియమించి JED వాళ్ళతో పని చేయించుకున్నారు హైకోర్టులు తిట్టకనే తిట్టింది కదా పబ్లిక్ డొమాండ్ లో ఎందుకు పెట్టలేదని పబ్లిక్ డొమండ్ లో పెట్టకుండా GO తీయడం అసెంబ్లీ లో మాట్లాడటం చట్టబద్ధత ఉండదు కెసిఆర్ ముస్లింలను బీసీలను సపరేట్ చూపించాడు వీళ్లు కలిపి రిజర్వేషన్లు అక్కడే అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదని అర్థం అవుతుంది రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడుతాం అన్నోళ్లు జంతర్ మంతర్ వద్ద ధర్నా ఎట్లా నిర్వహిస్తారు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి అమెరికాలో మీడియా ఇంటర్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రజలు అబద్ధాలనే నమ్ముతారు అందుకే మేము అవి చెప్పి మోసపోయేంత వరకు మోసం చేస్తూనే ఉంటాం అన్నాడు ఇప్పుడు పర్ఫెక్టుగా అదే చేస్తున్నాడు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బీసీ ల మీద ప్రేమ ఉంటే నామినేటెడ్ పోస్టులలో 72% రెడ్లకు ఎందుకు ఇచ్చారు ఏమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు బీసీ ఎన్ని ఇచ్చారో తెల్వదా??? ప్రజలంతా గమనిస్తున్నారు స్థానిక ఎలక్షన్ లో మీకు తగిన బుద్ధి చెప్తారు…