డ్రైవర్ నిర్లక్ష్యంతో డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు
11 మందికి చిన్నపాటి గాయాలు,ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు…
ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ సిబ్బంది…
ప్రశ్న ఆయుధం 18 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని కొయ్య గుట్ట వెళ్లే ప్రధాన రహదారిపై బాన్సువాడ నుండి ఎల్లారెడ్డి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి డివైడర్ పైకి వెళ్ళింది. స్టీరింగ్ ఎడమ పక్కకు గుంజడంతో డివైడర్ పైకి అదుపుతప్పినట్లు డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సులో 11 మందికి చిన్నపాటి గాయాలు కాగా ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.11 మంది పరిస్థితి నిలకడగా ఉందని తగిన వైద్యం అందుతుందని డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. ఆర్టీసీ బస్సు అంటే ప్రజలకు నమ్మకం అని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడుపుతున్నారు అందుకే బస్సు ఎక్కే ముందు బస్సు పరిస్థితిని డిపోలో డ్రైవర్ తెలుసుకోకుండానే ఎక్కడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు.డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు అంటున్నారు.