బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా
పార్టీలకు అతీతంగా బందు పిలుపుకు స్పందించిన బీసీ సంఘాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 18
జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాల బందు పిలుపుమేరకు స్వచ్ఛందంగా ధర్నా నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తమ హక్కులను సాధించేందుకు పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. బీసీల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా చౌరస్తా వద్ద ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది.