బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలుపరచాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలుపరచాలి

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారులు గొల్లపల్లి దయానందరావు

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 18 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా శాస్త్రీయంగా నిర్వహించిన సమగ్ర సామాజిక మరియు ఆర్థిక సర్వేలో వెనుకబడిన తరగతుల జనాభా శాతం 56.33 శాతం ఉన్నదని నివేదికలు సమర్పించారని,

అందువలన జనాభా దామాషా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయపరమైనదని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తు భవిష్యత్తులో భావ సారూప్యత గల అన్ని సంఘాలను కలుపుకొని ఈ డిమాండ్ ను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని చేపడతామని

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు మరియు జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానందరావు మరియు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ డిమాండ్ చేశారు. బందులో భాగం సంఘీభావాన్ని మద్దతున మద్దెల శివకుమార్ లతో అధ్యక్షులు చింతల చెరువుఅల్లి శంకర్, వరప్రసాద్, పెయింటర్ ప్రకాష్, కుడిక్యాల సమ్మయ్య, పల్నాటి సమ్మయ్య, సీతారాం,జాన్,సామ్యూల్ ,నాగరాజు తదితరులతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకుల నాగేశ్వర్ గౌడ్,భూపతి శ్రీనివాస్ ,మల్లెల రామనాథం, గుమలాపురం సత్యనారాయణ, పితాని సత్యనారాయణ,బండి రాజు గౌడ్,కొదుమూరి సత్యనారాయణ,కురిమెళ్ళ శంకర్,భూపతి అశోక్ తదితరులుపాల్గొన్నారు.

Join WhatsApp

Join Now