కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా  కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా

కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

వనస్థలిపురం, అక్టోబర్ 18: (ప్రశ్న ఆయుధం) ఎల్బీనగర్ నియోజకవర్గం బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రీ నగర్ ఫేస్ 2 కాలనీ నూతన కార్యవర్గం ఏర్పరచుకున్న సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బియన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి నీ వారి కార్యాలయంలో కలిసి కాలనీ లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే కాలనీ లో ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చందన్ నాయక్, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, ట్రెజరర్ శరత్ బాబు, ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, సుధాకర్, సెక్రటరీ గణేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, చంద్రశేఖర్, శంకర్, ఖాజా హుస్సేన్, ఏడుకొండలు, బుర్రహుద్దీన్, బాలకృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now