డ్రైనేజీ పైపులైన్ పనుల పరిశీలన
కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
వనస్థలిపురం, అక్టోబర్ 18: (ప్రశ్న ఆయుధం) ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధి లోని శ్రీ దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కాలనీలో మిగిలిన వీధుల్లో కూడా పూర్తి స్థాయి లో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ కు విజ్ఞప్తి చైయడం తో, కార్పొరేటర్ స్పందించి శ్రీ దుర్గా నగర్ కాలనిలో పూర్తి స్థాయి లో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని జలమండలి మేనేజర్ వాహిని కి తెలిపారు.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు బీరప్ప యాదవ్, సంక్షేమ సంఘం సభ్యులు రవి గౌడ్, సత్యనారాయణ, వీర స్వామి గౌడ్, శంకర్ రావు,పుష్పలత, సావిత్రమ్మ, ధనమ్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.