సంపూర్ణ మద్దతు తెలిపిన నాయి బ్రాహ్మణులు   సేవా సంఘం అధ్యక్షుడు రాపర్తి రవీందర్ 

సంపూర్ణ మద్దతు తెలిపిన నాయి బ్రాహ్మణులు

సేవా సంఘం అధ్యక్షుడు రాపర్తి రవీందర్

వనస్థలిపురం, అక్టోబర్ 18: (ప్రశ్న ఆయుధం) రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం నిర్వహించిన బందుకు మద్దతుగా వనస్థలిపురం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాపర్తి రవీందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నుండి ప్రారంభమై సాహెబ్ నగర్, రైతు బజార్, వనస్థలిపురం, బి.ఎన్.రెడ్డి నగర్, హస్తినాపురం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాపర్తి రవీందర్ మాట్లాడుతూ బీసీలకు 42% విద్యా ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లకు ప్రభుత్వాలు కోర్టులో వ్యతిరేకిస్తూ ఉదేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు అన్నారు. బీసీ బిల్లును తక్షణమే పార్లమెంటులో ఆమోదింపజేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అశోక్ కుమార్, వినోద్ కుమార్, సత్యనారాయణ, మధు, నరసింహ, భాస్కర్, మల్లేష్, గణేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now