బీసీల రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి – బీసీ సంఘాల జేఏసీ

బీసీల రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి – బీసీ సంఘాల జేఏసీ

జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ ను నిర్వహించారు ఈ బందులో బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీ ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాల నేతలు పాల్గొని బైకు ర్యాలీ నిర్వహించారు నాయకులు పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ 42% శాతం బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు జనాభాలో సగ భాగానికి పైగా ఉన్న బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. 56% శాతం ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొన్ని వర్గాలు ఎందుకు అడ్డుకుంటు- -న్నాయని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, కుల గణన ప్రక్రియ పూర్తి చేసి, శాసన సభలో బిల్లు ఆమోదం పొంది గవర్నర్ పంపిందని, గవర్నర్ కేంద్రానికి పంపడం జరిగిందని పంపి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే బీసీలు అత్యంత వెనుకబాటుకు గురవుతున్నారని, కనీస ప్రాతినిధ్యం లేక బీసీలు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు మీమేంతో మాకంతా, రిజర్వేషన్లు బీసీల న్యాయమైన హక్కు, 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎవరి హక్కులు కాలరాయట్లేదని, ఈ రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కొంత మంది రెడ్డి మిత్రులు కావాలని రిజర్వేషన్లు అడ్డుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఓ మాట ఢిల్లీలో ఓ మాట మాట్లాడుతూ బీసీల రిజర్వేన్ల అంశాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, బీసీ సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు పార్లమెంటులో వెంటనే చట్టం చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వంపై రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నేతలు మోత్కూరి శ్రీనివాస్, పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, మాదారపు రత్నాకర్, రావుల రాజబాబు, కనుమల్ల సంపత్, పెద్ది శివ కుమార్, రవీందర్, అన్వేష్, తిరుమల, దేవేందర్, రాజయ్య, పరమేష్, రితేష్, గట్టయ్య, మహేష్, శ్రావణి, సుమలత, రమ, తిరుపతి రెడ్డి, వెంకటేష్, సారంగం, రమేష్, సాయి, శ్రీనివాస్, తిరుపతి, మల్లయ్య, ఓదెలు, సంపత్, రాజు, సాగర్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్రెడ్డి, స్వామి, సుమన్, వీరన్న, గోపాల్ రెడ్డి, వేణు, తిరుపతి, అయిలయ్య, కుమార్, అభిలాష్, సత్తిరెడ్డి, రాజిరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now