బీసీల పట్ల కాంగ్రెస్ ది కపట ప్రేమ
కామారెడ్డి డిక్లరేషన్‌లోని ఒక్క హామీ కూడా అమలు కాలేదు
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ నేడు బీసీల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుమేరకు జిల్లా బిజెపి శాఖ బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ఈరోజు జరిగిన బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ముఖ్యంగా కామారెడ్డిడిక్లరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ హామీలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప అమలుకు నోచుకోలేదన్నారు.
60% జనాభా ఉన్న బీసీల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును బీసీలంతా గ్రహించాలన్నారు. ప్రధానంగా బీసీ సబ్‌ప్లాన్‌కి చట్టబద్ధత లేదని, బడ్జెట్లో కేటాయింపులు లేవని, 20 వేల కోట్ల హామీ గాల్లో కలిసిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అన్ని కులవృత్తుల వారి బతుకులు రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో ఆగమయ్యాయని, తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా చేశారనన్నారు. పులగన్న సర్వే ఆశాశ్రీయంగా అప్రమాణికంగా రాజకీయ ఉద్దేశాలతో నిండిపోయిందని ఆయన విమర్శించారు.ఓవర్గం వారికి మేలు చేసేలా బీసీలకు అన్యాయం చేసేలా 42 శాతం రిజర్వేషన్లను తెరమీదికి తెచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ డ్రామాలు చేస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. 1931 తర్వాత అసలు కులగణన జరగకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పాలన అని, ఆరు దశాబ్దాల పాటు కేంద్రంలో ఉన్నా పట్టించుకోక నేడు రాజకీయ డ్రామాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక్కడ కులగనన సర్వే పూర్తి చేశాం అంటున్న కాంగ్రెస్
డేటా ను మాత్రం దాచేసిందని , ఇది పూర్తిగా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది కేవలం బిజెపిఅని చెప్పారు బీజేపీ ప్రభుత్వం ఓ బి సి కమిషన్‌కి రాజ్యాంగ హోదా ఇచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. ఎన్నో పథకాలను తీసుకువచ్చి బీసీలకు అండగా నిలుస్తుంది కేవలం బిజెపి ప్రభుత్వం మాత్రమేనన్నారు. కులగణనపై మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, 75 ఏళ్ల తర్వాత దేశంలో 2027లో జరగబోయే దేశ జనగణన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయ పద్ధతిలో, డిజిటల్ ఆధారాలతో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మోదీ ప్రభుత్వ నిబద్ధత ఆధునిక, పారదర్శక జనగణన వైపు మరో అడుగు
జనగణనలో సేకరించే నిజమైన గణాంకాలు భవిష్యత్తులో ఓ బి సి రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, లక్ష్యబద్ధమైన సంక్షేమ పథకాలు రూపకల్పనకు ఆధారం కానున్నాయన్నారు.