షిరిడి నగర్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం, అక్టోబరు 19: కూకట్పల్లి ప్రతినిధి
124 కాలనీ డివిజన్ పరిధిలోని షిరిడి నగర్ లో డ్రైనేజ్ నాలా సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీ లో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ షిరిడి నగర్ కాలనీ లో ఓపెన్ నాలా కు రిటైనింగ్ వాల్ కొంతమేర పెండింగ్ ఉందని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు కాలనీ అసోసియేషన్ ఆఫీస్ నిర్మించుకుంటామని కార్పొరేటర్ కి తెలియచేయగా సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ అసోసియేషన్ ఆఫీస్ నిర్మాణం కొరకు తగిన సాయం చేస్తానని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శిరిడి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్
ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మూర్తి, ట్రెజరర్ ప్రవీణ్ సింగ్, సభ్యులు
చంద్రమౌళి, ప్రకాష్, ఉదయ్ కిరణ్, సాయిబాబా, రాజేష్, సురేష్ బాబు, రమేష్, రాంగోపాల్, ఆనందబాబు , మూల్చంద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.