బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసేంతవరకు పోరాటము ఆగదు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసేంతవరకు పోరాటము ఆగదు

బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజకుమార్

జమ్మికుంట అక్టోబర్ 19 ప్రశ్న ఆయుధం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసేంతవరకు పోరాటము ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని వారు తెలిపారు. ఈ బందుకు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థల, ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, పట్టణ, మండల ప్రజలకు, కాంగ్రెస్, బిజెపి, సీపీఎం, సిపిఐ ,ఎస్సీ కుల సంఘ నాయకులకు, సహకరించిన ఇతర సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ కు పంపించడం చాలా సంతోషమని సుప్రీంకోర్టుకు అగ్రకులాలకు చెందిన ఒక వ్యక్తి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని పిటిషన్ వేయడంతో కోర్టు కొట్టి వేయడం బాధాకరమన్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇస్తున్నందున, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరారు. లేనియెడల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉదృతం చేస్తామని వారు తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారన్నారు. మరి ఈ పోరాటము ఏ పార్టీ పైన చేస్తున్నారని కొంతమంది మేధావులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని వారు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 19 శాతం, బీసీలకు 50 శాతము మొత్తము 69 శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుందన్నారు. అవసరమైతే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారో ప్రత్యేకమైన కమిటీ వేసి ,దానిపై అధ్యయనం చేసి, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సమ్మెటసదానందం, దాసరి రామ్మూర్తి గౌడ్,ధర్ముల శంకర్ ,రావుల తిరుపతి,గండి రంజిత్ కుమార్, కైలాసకోటి సమ్మయ్య,రా చమల్ల రవి,బూరుగుపల్లి రాము,పసునూటీమల్లికార్జున్,బూరుగుపల్లినాగరాజు,షనగొండ శ్రీనివాస్, రావుల రాజేందర్, రావుల అంజి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now