కాక రెస్టారెంట్ ప్రారంభం 

కాక రెస్టారెంట్ ప్రారంభం

వనస్థలిపురం, అక్టోబర్ 19: ( ప్రశ్న ఆయుధం) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ రైతు బజార్ దగ్గర ఏర్పాటు చేసిన కాకా రెస్టారెంట్ ను ఆదివారము వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర వాసులకు మంచి రుచులు ప్రజలకు అందించేందుకు కాకా రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయం అన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు వినియోగదారులకు నాణ్యత, పరిశుభ్రతలో అతి జాగ్రత్తగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆహారం అందించాలని వారు సూచించారు. రెస్టారెంట్ నిర్వాహకులు సాయి, శివ మాట్లాడుతూ ఆహారమే ఆరోగ్యం అనే నినాదంతో ఎటువంటి కల్తీ లేని ఆహారం, రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమములో మనసురాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జెక్కిడి రఘు వీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now