అధిక వడ్డీలతో పేదలను దోచుకుంటున్న మార్వాడీలు, పాన్ బ్రోకర్లు..!!

అధిక వడ్డీలతో పేదలను దోచుకుంటున్న మార్వాడీలు, పాన్ బ్రోకర్లు..!!

జగదేవ్‌పూర్‌లో మహిళా రైతు ఫిర్యాదు – పోలీసుల హెచ్చరిక..!

పేదలు, రైతులను అధిక వడ్డీ పేరుతో మోసం చేస్తున్న పాన్ బ్రోకర్లు..!

బంగారం కుదువపై రూ.25,000 అప్పు – చెల్లించేటపుడు రూ.28,000 వసూలు..!

అధిక వడ్డీపై వసూళ్లతో మహిళా రైతుకు షాక్..!

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు – ఎస్సై కృష్ణారెడ్డి స్పందన

“గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థల ద్వారానే లోన్ తీసుకోవాలి” – పోలీసుల సూచన

జగదేవ్‌పూర్‌, అక్టోబర్‌ 22 (ప్రశ్న ఆయుధం):

జగదేవ్‌పూర్ మండలంలో అధిక వడ్డీలతో ప్రజలను, రైతులను దోచుకుంటున్న మార్వాడీలు, పాన్ బ్రోకర్ల దందా బహిర్గతమైంది. పీర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఒకరు చౌదరీ పాన్ బ్రోకర్ వద్ద బంగారాన్ని కుదువ పెట్టి రూ.25,000 అప్పు తీసుకున్నారు.

రెండు రూపాయల వడ్డీ ఒప్పందంతో తీసుకున్న అప్పుకు చెల్లించేందుకు వెళ్లిన ఆమెకు, మూడు రూపాయల వడ్డీగా రూ.28,000 వసూలు చేయడంతో పాటు రూ.6,000 అదనంగా డిమాండ్ చేశాడు. దీనిపై షాక్‌కు గురైన ఆమె జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎస్సై కృష్ణారెడ్డి హెచ్చరిక..!!

ఈ సందర్భంగా ఎస్సై కృష్ణారెడ్డి మాట్లాడుతూ —

“అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం చట్టపరంగా తప్పు. ప్రజలు ఈ రకమైన వలల్లో పడకూడదు. అవసరమైతే ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు పొందాలి,” అని సూచించారు.

అధిక వడ్డీలతో మోసపోతున్న ఎవరైనా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“పేదల ఆర్థిక ఇబ్బందులను దోపిడీ మార్గంగా మార్చే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు,” – ఎస్సై కృష్ణారెడ్డి

Join WhatsApp

Join Now

Leave a Comment