ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి..!
అక్టోబర్ 22 కామారెడ్డి జిల్లా
భిక్కనూర్ ప్రశ్న ఆయుధం
భిక్కనూర్ మండల కేంద్రంలోని దక్షిణ కాశీ గా భాసిల్లుతున్న శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి (స్వయంభు లింగ) మహా క్షేత్ర, ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు.కాగా
సిద్ధరామేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ గా, తాటిపాముల లింబాద్రి, వైస్ చైర్మన్ గా
అందే దయాకర్ రెడ్డి, డైరెక్టర్లుగా, సింగారపు నర్సమ్మ, నీలా అంజయ్య,
సామ సంతోష్ రెడ్డి,
నాగర్తి రమేష్ రెడ్డి, అక్కు కార్తీక్ తదితరులు నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ… తమ పై నమ్మకం తో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమం లో షబ్బీర్ అలీ తో పాటు సురేష్ షట్కార్ మరియు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, భిక్కనూర్ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.