తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి ఉపయోగపడే వస్తువు వితరణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి ఉపయోగపడే వస్తువు వితరణ

వితరణ చేసిన షఫీ ఖాన్ ని అభినందించిన గ్రామస్తులు

జమ్మికుంట ఇల్లందకుంట,అక్టోబర్22 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ ప్రజల అవసరార్థం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని షఫీ ఖాన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా షఫీ ఖాన్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం సుమారు 61వేల రూపాయల విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ని అందజేసినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు భవిష్యత్ లో వైకుంఠ రథం కూడా అందించనున్నట్లు తెలిపారు. పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ షఫీ ఖాన్ ముందుకు వచ్చి పేద ప్రజల అవసరాలను తీర్చడానికి ముందుకు వచ్చినందుకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవలని తెలిపారు షఫీ ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ యువకులు షఫీ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుర్ర రమేష్, రేనుకుంట్ల కుమార్, మాజీ ఎంపిటిసి రేనుకుంట్ల చిన్న రాయుడు, మంగళంపల్లి సంపత్ కుమార్, రేనుకుంట్ల తారక్, కాంగ్రెస్ గ్రామ ఉప అధ్యక్షుడు పుట్ట రాజు, రఫీ, ఇల్లందకుంట ఆలయ కమిటీ ధర్మకర్త కురిమిండ్ల చిరంజీవి,బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, సారంగం, రామకృష్ణ, వైకుంఠం, అయిలయ్య, రమేష్, కుమార్, చింటూ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment