దుర్కి శివారులో విద్యార్థినులతో బస్సు ప్రయాణం చేసిన ఎమ్మెల్యే పోచారం

విద్యార్థినుల ప్రయాణ ఇబ్బందులు గమనించిన పోచారం శ్రీనివాసరెడ్డి

డిపో మేనేజర్‌కి కాల్‌ చేసి ప్రత్యేక ఆర్ ర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు ఆదేశాలు

విద్యార్థినులతో కలిసి బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు

విద్యార్థినుల ‘థాంక్యూ సర్’తో సంతోషించిన పోచారం విద్యార్థినుల భద్రత, సౌకర్యంపై ఆరాటం చూపిన ప్రజాప్రతినిధి నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో ఉన్న ఎస్‌.ఆర్‌.ఎన్‌.కే కళాశాల సమీపంలో చదువుకోడానికి వెళ్తున్న గురుకుల వసతి గృహ విద్యార్థినుల సమస్యను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం విద్యార్థినులకు ఊరట కలిగించారు.

ఈ నెల 14వ తేదీ ఉదయం బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్తున్న పోచారం, మార్గమధ్యంలో బాన్సువాడ-నిజామాబాద్ ప్రధాన రహదారిపై విద్యార్థినులు బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లు గమనించారు. వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌కు ఫోన్ చేసి ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తరువాత తానే విద్యార్థినులతో కలిసి బస్సులో బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు ప్రయాణించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. “ఇకపై ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు ఉండవు” అని హామీ ఇచ్చారు. తమ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యేకు విద్యార్థినులు ధన్యవాదాలు తెలుపుతూ “థాంక్యూ సర్” అన్నారు. విద్యార్థినుల ఆ ఆనందభావాన్ని చూసి పోచారం చిరునవ్వు చిందించారు.ప్రజా ప్రతినిధిగా విద్యార్థుల సమస్యలపై చూపిన చిత్తశుద్ధి పోచారం మానవీయతకు మరో నిదర్శనమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment