కల్యాణలక్ష్మి – షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం 155 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి మరియు షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ లబ్ధిదారులు బాన్సువాడ, బీర్కూర్, నసర్లబాద్, వర్ని మండలాలకు చెందినవారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేఖ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, నాయకులు నార్ల రవీందర్, నార్ల సురేష్, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్, గోపాల్ రెడ్డి, యండి దావూద్, నార్ల ఉదయ్, అసద్ బిన్ మొహ్సిన్, అఫ్రోజ్, వహబ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ — “ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి అర్హురాలికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment