నా స్వార్థం ఉంటే చెప్పుతో కొట్టండి :ఎమ్మెల్యే పోచారం

నా స్వార్థం ఉంటే చెప్పుతో కొట్టండి :ఎమ్మెల్యే పోచారం

విలేకరుల సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పోచారం..

ప్రశ్న ఆయుధం 23 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.నాపై కొందరు గిట్టని వారు పోచారం రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారారంటూ చేస్తున్న ఆరోపణలపై ఖండించారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ…నేను బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కొరకు పార్టీ మారాను తప్ప రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచింది వాస్తవమే అనీ పోచారం అన్నారు.స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకవేళ నా స్వార్థం కోసం పార్టీ మారినట్లయితే చెప్పుతో కొట్టాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో బాన్సువాడ సెగ్మెంట్ లో ఈ విషయమై హాట్ టాపిక్ గా మారిందని స్థానికులు అంటున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి,ఏజాజ్,మోహన్ నాయక్,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment