కొట్టుకుపోయిన కల్వర్టుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలి
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 24
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బుంగాపుట్టు పంచాయతీ పరిధి చుట్టు గొంది గ్రామానికి వెళ్లే కల్వర్టు కొట్టుకుపోయింది దీనితో రాకపోకలు స్తంభించాయని పంచాయతీ వార్డు సభ్యుడు కొర్ర గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారి యంత్రాంగం స్పందించి కొట్టుకుపోయిన కల్వర్టుపై శాశ్వత వంతెననిర్మాణం చేపట్టి కష్టాలు తీర్చాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు
శాశ్వతనిర్మాణం చేపట్టాలి
Published On: July 24, 2024 2:16 pm