నిర్మల్ జిల్లా కలెక్టర్ కు ఘనంగా సన్మానించిన – ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం.

నిర్మల్ జిల్లా కలెక్టర్ కు ఘనంగా సన్మానించిన – ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం.

నిర్మల్ అక్టోబర్ 25

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, ఇటీవల జిల్లా కలెక్టర్  జాతీయస్థాయిలో నీతియోగ్ జల్ శక్తి విభాగంలో గుర్తింపు పొంది కేంద్ర మంత్రితో అవార్డు తీసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. వారు జలశక్తి కార్యక్రమంతో పాటు బాలశక్తి అనే విద్యార్థుల కోసం నిర్మల్ జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వారిని ప్రత్యేక గుర్తింపునిచ్చి వారికి గౌరవించింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజానా అహ్మద్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జిల్లా నాయకులు తుంగూర వెంకట రాజ్యం, మరియు జాడి శ్రీనివాస్, సన్న పూరి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment