ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నిజ్జన మహేందర్

IMG 20251025 WA0167

ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు వెల్లుట్ల వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నిజ్జన మహేందర్‌ను మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు.

ఈ నియామకాన్ని శాసనసభ్యులు మదన్ మోహన్ ప్రకటించి, మహేందర్‌కు నియామక పత్రాన్ని అందజేసారు. పార్టీ పట్ల ఆయన చూపిన కృషి, అంకిత భావాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సోషల్ మీడియా “పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, నాయకుల సేవా కార్యక్రమాలను ప్రజల దాకా చేర్చే ప్రధాన వేదికగా మారింది. యువత ముందుకు వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి” అని అన్నారు.

మహేందర్ పార్టీ ఆన్‌లైన్ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment