దళితులను గుడిలోకి రానివ్వని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

దళితులను గుడిలోకి రానివ్వని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ కు పంపాలి

జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ వెంటనే గ్రామాన్ని సందర్శించాలి

కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాలకిషన్

సిద్దిపేట ఆగస్టు 27 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో దళితులకు గుడిలోకి ప్రవేశం లేదంటూ వెలి వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని రిమాండ్ పంపాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాలకిషన్ డిమాండ్ చేశారు. కొమురవెల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ లో ఈనెల 21 నుండి 25 వరకు దుర్గమ్మకు బోనాలు బ్రహ్మోత్సవాలు గ్రామంలోని జరపడం జరిగింది తేదీ 24 శనివారం సాయంత్రం 5 గంటలకు గ్రామానికి చెందిన గొల్లపల్లి కిషన్ గౌడ్ పుట్ట సత్తయ్య శేరి వెంకటయ్య బచ్చల సురేష్ తుమ్మల సత్తయ్య అనే వ్యక్తులు మాదిగోళ్ళు దళితులు మీరు గుడిలోకి వస్తారా అంటూ నానా బూతులు తిడుతూ మీ గుడిలోకి రావద్దు కొబ్బరికాయలు కొట్టొద్దు గుడి మెట్ల కూడా తాగొద్దంటూ నానా బూతులు తిట్టిన వీరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ పంప వలసిందిగా కెవిపిఎస్ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని వారంలో ఏదో ఒక గ్రామంలో వివక్షత జరుగుతున్నది ప్రభుత్వ యంత్రాంగం మరియు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతినెల 30 వ తారీఖున పౌర హక్కుల దినం జరపాలని ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కర్రోల్ల ఎల్లయ్య ఆరుట్ల రవీందర్ కాసాల రాజేశ్వరు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now