ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్

ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్

*జాతీయ కమిటీ చైర్మన్ జే బి రాజు,వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొన్నారు*

*హైదరాబాద్ గాజుల రామరం లో రాష్ట్ర కమిటీ సమావేశం*

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 25 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ గాజుల రామరంలో శనివారం నిర్వహించారు.

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ అధ్యక్షతన కొనసాగించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ జాతీయ కమిటీ చైర్మన్ డాక్టర్ జె బి రాజు,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.

పాలన సౌలభ్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైన హక్కులు విద్యా,ఉద్యోగ,ఉపాధి రాజకీయపరమైన రిజర్వేషన్లు మరియు,నివాసం ఉంటున్న ఇంటిపై, సాగు భూములకు హక్కులు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఉద్యమం నిర్మాణం

జరుగుతుందని తెలియజేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కంటే అత్యధికంగా అభివృద్ధిలో వెనుకబడ్డది ఎస్సీ కులాలేననిఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఎస్సీ కులాలంతా ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు అతి .అతి త్వరలోనే రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకపోవడానికి సమయం అవుతున్నట్లు తెలియజేశారు.ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ జహంగీర్ హుస్సేన్,రాష్ట్ర కన్వీనర్ దుర్గo నగేష్,కన్వీనర్ అవిలయ్య, బాలరాజు,గౌడ ఐలయ్య,డాక్టర్ ఏ జేమ్స్,డాక్టర్ భూదాల అమర్నాథ్ ,సయ్యద్ ఉస్మాన్ హుస్సేన్,సుశీల కుమారి

,బహుజన కళాకారుడు శంకర్,ఆర్ఎం రాజు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now