రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి

రోడ్ల మరమ్మత్తుల కోసం కమిషనర్ కలిసిన అయ్యప్ప నగర్ కాలనీ వాసులు

గజ్వేల్ ఆగస్టు 27 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు లోని అయ్యప్ప నగర్ కాలనీలో గల వీధులలో రోడ్ల మరమ్మతుల ను వెంటనే చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండ్ల స్వామి, మోతె వీరారెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ వీధుల రోడ్ల మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులకు, అధికారులకు చాలాసార్లు చెప్పి ఉన్నామని ఇప్పటివరకు ఈ వీధుల లోని రోడ్లను బాగు చేయడం లేదని సిసి రోడ్లు వేయడం లేదని అన్నారు మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్ల పనుల ప్రారంభోత్సవం ఈ కాలనీలోనే గత ప్రభుత్వము లోని మంత్రివర్యులు అధికారులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినారు అని దానితో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారని ఆ ఆనందం ఆవిరి అయిపోయిందని అన్నారు. ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని మరిచిన పాలకులు, అధికారులు ప్రజలు నివాసం ఉండని ఓపెన్ ప్లాట్ల సమీపంలోని రోడ్ల లో అవసరం లేని చోట సిసి రోడ్ల నిర్మాణాలు జరిగినాయని ప్రజలు నివాసముంటున్న అయ్యప్ప నగర్ కాలనీలోని వీధులలో సిసి రోడ్లు వేయకపోవడం శోచనీయమని అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు సత్య ఫంక్షన్ హాల్ వీధిలోని రహదారులు రాజిరెడ్డి పల్లె రాజీవ్ పార్కు వెళ్లే వీధిలోని రహదారులు పూర్తిగా పాడైనవని మోరీలపై ఉండే కల్వర్టు కృంగిపోయి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే పరిస్థితిలో ఉన్నాయని వెంటనే మరమ్మత్తులు చేపించాలని కమిషనర్ తో విన్నవించినారు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించినారని ఇట్టి విషయాన్ని పరిశీలించి చర్యలు చేపడతామని అన్నారని తెలిపినారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జంగం రమేష్ గౌడ్ కార్యదర్శులు స్వర్గం రాజేశం, వగ్గు మల్లేశం కోశాధికారి అలివేలి నారాయణరెడ్డి, అసోసియేషన్ నాయకులు జీవన్ రెడ్డి, చంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now