విజిలెన్స్ వారోత్సవంలో అవినీతి రహిత వాతావరణం పిలుపు

*విజిలెన్స్ వారోత్సవంలో అవినీతి రహిత వాతావరణం పిలుపు*

నిజామాబాద్, జిల్లా ప్రతినిధి,నవంబర్ 1 (ప్రశ్న ఆయుధం):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం 6వ రోజు కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ యస్‌. మాధుసూదన్ పాల్గొని సిబ్బందికి విజిలెన్స్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి ఉద్యోగి నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలి. విజిలెన్స్ అంటే కేవలం పర్యవేక్షణ మాత్రమే కాదు, మన మనసులోని ధర్మాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యం,” అని పేర్కొన్నారు.

అవినీతి రహిత వాతావరణం ఏర్పాటుకు అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని విజిలెన్స్ ప్రతిజ్ఞ స్వీకరించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now